అనితక్కా... ఏందిదీ.. హోం మంత్రి అనితపై మాధవీలత ఫైర్..

ఏపీలో గణేష్ మండపాలకు చలాన్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. గణేష్ మండపాల వద్ద సౌండ్ సిస్టం కోసం రోజుకు రూ.100, విగ్రహం సైజును బట్టి రూ.350, 750రూపాయల చలాన్లు కట్టాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత మంత్రి అనితపై ఫైర్ అయ్యారు. అనితక్కా.. ఏందీ నీ తిక్క అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఓ విడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు.

మాధవీలత తన ఇంస్టాగ్రామ్ లో వీడియోను పోస్ట్ చేస్తూ.. ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి సిద్దం గా ఉంటారని, అసలే గణేశుడికి ఆకలి ఎక్కువ... ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు ముఖాన వేస్తారు ఏముంది అంటూ ఎద్దేవా చేశారు. అందరికీ హిందూ పండగల మీద చిల్లర ఏరుకోవడమే పని అని.. అన్ని మతాలు సమానం అన్ని పండగలు సమానం అందరూ సమానం అయితే, మరి మా మైక్ సెట్ కి, మా గణేశ మంటపాలకి, మా గణేష్ ఎత్తుకి డబ్బులెందుకో అంటూ ప్రశ్నించారు.

మొన్న  చిన్నపిల్లని మానభంగం చేసి చంపేసిన కేసు.. ఉయ్యాల్లో బిడ్డని మానభంగం చేసిన ముసలోడికి ఉరిశిక్ష  వేయలేదా అంటూ ప్రశ్నించిన మాధవీలత.. ఇప్పుడు గణేష్ మంటపాలు దగ్గర వసూలు చేసే డబ్బుతో లాయర్లను పెడతారా అంటూ ఎద్దేవా చేశారు.