Jyothika: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి జ్యోతిక

సినీ నటి జ్యోతిక (Jyothika) ఇవాళ నవంబర్ 27న తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ ప్రారంభ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.

టీటీడీ అధికారులు జ్యోతికకు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

జ్యోతిక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్గా అజయ్ దేవగన్ తో నటించిన షైతాన్, మలయాళ స్టార్ మమ్ముట్టి తో కాదల్ ది కోర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాల్లో నటిస్తూనే..మంచి కంటెంట్ ఉన్న సినిమాలని నిర్మిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. సూర్య జ్యోతిక జోడిగా కనిపిస్తున్నట్లు సమాచారం. బ్లాక్ బాస్టర్ బెంగుళూరు డేస్‌ ఫేమ్‌ అంజలి మేనన్‌ డైరెక్షన్ లో  సూర్య‌, జ్యోతికలు కలిసి ఓ మూవీ చేయనున్నారట. ప్రస్తుతం ఈ జోడీని స్క్రీన్ పై చూపించడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ అందమైన జంట కాంబోపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇక ఇదే కనుక నిజమైతే దాదాపు 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక మరోసారి వెండితెరపై.. కలిసి ప్రేమ పాఠాన్ని అభిమానులకి చెప్పే సమయం అతి దగ్గర్లోనే ఉంది.