అచ్చ తెలుగు హీరోయిన్ ఆనంది.. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో నటిస్తోంది. మంగళవారం (December 10న) ఆనంది పుట్టినరోజు.
ఈ సందర్భంగా తను నటిస్తున్న ‘భైరవం’ మూవీ టీమ్ బర్త్‌డే విషెస్‌తో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చీరకట్టులో ట్రెడిషినల్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తోంది ఆనంది. ఇందులో నీలిమ పాత్రలో ఆమె కనిపించనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు.
విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
Wishing the ????????? ?????? ‘Neelima’ aka the sweetest and lovely @anandhiactress a very happy birthday ?
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) December 10, 2024
Your presence brings a touch of elegance to the massy world of #Bhairavam ❤️@BSaiSreenivas @HeroManoj1 @IamRohithNara @DirVijayK pic.twitter.com/YRMmmWv3VI