తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రాణిస్తున్న యంగ్ బ్యూటీ అక్షర గౌడ (Akshara Gowda). తాజాగా అక్షర గౌడ పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
"ఇపుడు మమ్మీ డ్యూటీలు చేయడంలో చాలా బిజీగా ఉన్నాను.. ఈ 2024 సంవత్సరం ముగుస్తుంది.. చివర్లో చాలా కోరికలు నెరవేరుతున్నాయి.. తనకు (భర్త) బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాను. 9 నెలలు నా కడుపులో మోసి.. అచ్చం తనలాగే ఉండే ఒక బేబీ ని గిఫ్ట్గా ఇచ్చాను" అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చిందీ అక్షర గౌడ.
అయితే, ఈ సందర్భంగా తన బేబీ కి సంబందించిన క్యూట్ ఫొటోలను కూడా ఇన్స్టా లో షేర్ చేసింది. కానీ, తనకు పుట్టింది పాపనో, బాబునో అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఇంతకు ముందు బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన అక్షర గౌడ.. ఇప్పుడు తన బేబీతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది.
ALSO READ : Adivi Sesh Movies: అడివి శేష్ సర్ప్రైజ్ పోస్ట్.. ఆ రెండు పాన్ ఇండియా సినిమాల అప్డేట్స్
ఈ అమ్మడిది కన్నడ అయిన తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో విశ్వక్ సేన్తో దాస్ కా దమ్కీ, మన్మథుడు 2, హరోం హర, ది వారియర్, ఇటీవలే మోక్ష ఐలాండ్ మిస్టరీ, మిక్సప్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.