రజినీకి కొత్త చిక్కులు..స్టెరిలైట్ కేసులో సమన్లు

రజినీకి కొత్త చిక్కులు..స్టెరిలైట్ కేసులో సమన్లు
తమిళ తలైవ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వడంతో అసలు రాజకీయం మొదలైంది. రజనీపై పాత కేసులు తిరగతోడే ప్రయత్నం చేస్తుంది తమిళనాడు ప్రభుత్వం.  తుత్తుకూడిలోని స్టెర్లైట్ కర్మాగారం కేసులో 2021 జనవరి 19 లోపు  రజనీకాంత్‌ వ్యక్తిగతంగా హాజరు కావాలని  జ్యుడిషియల్ కమిషన్  సమన్లు జారీ చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు జ్యుడిషియల్ కమిషన్ హెడ్ రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ ఈ సమన్లు ​​జారీ చేశారు.  జనవరిలో పార్టీ అనౌన్స్ చేస్తానని రజినీ ప్రకటించారు. 2018 మే 21-22న తుత్తుకూడిలోని స్టెర్లైట్ కంపెనీ మూసివేయాలంటూ నిరసన జరిగింది. అప్పట్లో కంపెనీలో ఫైరింగ్ జరగడంతో  13 మంది చనిపోయారు. అయితే ఈ దాడులు ఉద్దేశ పూర్వకంగా జరిగాయని.. దాడి వెనక సంఘవిద్రోహ శక్తులు ఉన్నాయని అప్పట్లో రజినీ కాంత్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రజినీకాంత్ హాజరవ్వాలని విచారణ కమిషన్ సమన్లు జారీ చేయగా..ఆయన మినహాయింపు కోరారు.