ఇదేమి ఆనందం పవన్..! ప్రకాష్ రాజ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్

ఆంధప్రదేశ్‎తో పాటు దేశ మొత్తం హాట్ టాపిక్‎గా మారిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‎ను ఉద్దేశించి పరోక్షంగా నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేశారు. ‘‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో..!’’ జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్‎ను ఉద్దేశించే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?  

తీవ్ర దుమారం రేపుతోన్న తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై ఓ సినిమా ఆడియో ఫంక్షన్‎లో యాక్టర్ కార్తీ స్పందించారు. తిరుపతి లడ్డూ ఇష్యూ ఇప్పుడు చాలా సెన్సిటివ్ అని.. దానిపై ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దని సరదాగా కామెంట్ చేశాడు. అయితే, కార్తీ వ్యాఖ్యలపై డిప్యూటీ పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూపై కామెడీగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ గురించి ఫన్ కామెంట్స్ చేయడం సరికాదని.. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అంటూ కార్తీ  అనడం తప్పు.. అతను చేసిన కామెంట్స్ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని పవన్ అన్నారు.  

ALSO READ | కక్కమ్మా.. నిజం కక్కు: జానీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

పవన్ కల్యాణ్ సీరియస్ కావడంతో వెంటనే రెస్పాండ్ అయిన కార్తీ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై తాను తప్పుగా మాట్లాడలేదని.. అయినా నా మాటలు తప్పుగా అనిపిస్తే సారీ అంటూ పవన్ కల్యాణ్‎కు క్షమాపణలు చెప్పారు. తాజాగా ఈ ఇష్యూపైనే ప్రకాష్ రాజ్ ఇన్ డైరెక్ట్‎గా ట్వీట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. లడ్డూ విషయంలో చేయని తప్పుకి కార్తీతో పవన్ కల్యాణ్ సారీ చెప్పించుకోవడం ఏంటని అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారు. అయితే, తిరుమల లడ్డూ విషయంలో కార్తీ చేసిన వ్యాఖ్యల్లో తప్పే లేదని.. పవన్ కల్యాణ్ కాస్తా ఓవర్ రియాక్ట్ అయ్యి కార్తీతో సారీ చెప్పించుకున్నాడంటూ ప్రకాష్  రాజ్ అభిప్రాయంతో నెటిజన్లు ఏకీభవిస్తు్న్నారు.