రేణుక స్వామి హత్య కేసు విచారణలో పోలీసులు ఒక్కొక్కటిగా అన్ని నిజాలను బయటకు రాబడుతున్నారు. రేణుక స్వామి(33)ని యాక్టర్ దర్శన్ చిత్రహింసలు చంపుతున్నప్పుడు పవిత్ర గౌడ్ అక్కడే ఉందని పోలీసులు తెలిపారు. ఆమె బాధితున్ని కొట్టి టార్చర్ చేసినప్పుడు సంఘటన ప్రదేశంలోనే ఉందని పోలీసులు విచారణలో తేలింది. పవిత్ర గౌడ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆమె హీరో దర్శన్ తూగుదీపకు ఫిర్యాదు చేసింది.
ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని దర్శన్ ను కోరింది. దర్శన్ రేణుక స్శామిని చంపడానికి కొంతమందికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. జూన్ 8న స్వామిని అతని స్వస్థలం చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి 200 కి.మీ దూరంలోని బెంగళూరులోని ఒక షెడ్‌కి తీసుకెళ్లారు. అక్కడికి పవిత్ర, దర్శన్ లు వచ్చారు. తర్వాత స్వామిని కర్రలతో కొట్టి, కరెంట్ షాక్ పెట్టి టార్చర్ చేసి చంపారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పవిత్ర అక్కడే ఉన్నారు. ఈ కేసులో పవిత్ర, దర్శన్ లతో సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
