శ్రీశైల మల్లన్న సేవలో గోపీచంద్

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లికార్జునస్వామిని మంగళవారం సినీనటుడు గోపిచంద్ దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న గోపిచంద్ కు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జునస్వామికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.