చిక్కడపల్లి పోలీస్ స్టేషన్​కు అల్లు అర్జున్

  • కోర్టు ఆదేశాల మేరకురిజిస్టర్​లో సంతకం

ముషీరాబాద్, వెలుగు: నటుడు అల్లు అర్జున్ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్​కు వచ్చి సంతకం పెట్టారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్​లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్​పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో అతనికి హైకోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

 అయితే 8 వారాల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10.30 గంటలకు చిక్కడపల్లి ఠాణా​కు వచ్చి సంతకం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మొదటి ఆదివారం 10.30 గంటలకు పోలీస్ స్టేషన్​కు వచ్చిన అల్లు అర్జున్.. రిజిస్టర్​లో సంతకం చేశారు. 10.45 గంటలకు వెళ్లిపోయారు.