కోల్‌కతా: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. టీఎంసీ నుంచి పోయిన వారం బీజేపీలో చేరిన ఎంపీ సునీల్ మోండాల్‌కు టీఎంసీ కార్యకర్తలు షాకిచ్చారు. బీజేపీ ఆఫీసుకు వెళుతున్న సునీల్ కారును అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ ఆఫీస్ వద్ద కొంతసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సుమారు అరగంట సేపు ఆయన కారును కార్యకర్తలు నిర్బంధించారు. అక్కడికి పోలీసులు చేరుకుని సునీల్ కారును సేఫ్‌గా పంపించారు. పోలీసులు అడ్డుకుంటున్నా నిరసనలు కొనసాగించిన కార్యకర్తలు, వాళ్లు పెట్టిన బారికేడ్లను పక్కకు తోసేశారు. ఇది టీఎంసీ కార్యకర్తల నిజస్వరూపం, ప్రజాస్వామ్యం పట్ల వారికి నమ్మకంలేదని ఎంపీ సునీల్ మోండాల్ అన్నారు.
For More News..
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్‌కు అలర్జీ
యువతకు ట్రైనింగ్‌తో పాటు అప్పు కూడా ఇచ్చి బిజినెస్ పెట్టించే కొత్త స్కీం
అమెజాన్ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తే డబ్బులంటూ స్కాం.. లక్షల్లో ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
