
కొన్ని పాములు కాటేస్తాయి. కొన్ని పాములు తోకతో కొడతాయి. మరికొన్ని పాములు నాలుకతో నాకి చంపేస్తాయి. మరికొన్ని అయితే మింగేస్తాయి. కానీ ఈ పాము మాత్రం నటిస్తుంది. మామూలుగా గా కాదు..కమలాసన్ నటనకు ఏ మాత్రం తీసిపోదు. ఏంటీ పాము నటించడమేంటని ఆశ్చర్యపోతున్నారా..అవును నిజమే..
ఈ పాము వింత వేషాలు భలే అనిపిస్తున్నాయి. ఈ పాము నటన ముచ్చటేస్తుంది. సినీ పరిశ్రమల్లో ఈ పాము నటించినట్లుగా మరెవ్వరూ నటించరంటే నమ్మండి. ఓ వీడియోలో పామును ఓ వ్యక్తి ముట్టుకోబోతాడు. అప్పటి వరకు పాకుతూ ముందుకు సాగిన పాము..ఆ వ్యక్తి ముట్టుకోగానే నాలుక బయటపెట్టి చనిపోయినట్లు యాక్టింగ్ చేస్తుంది. ఆ వ్యక్తి పామును కదిలించడానికి ప్రయత్నిస్తాడు. కానీ పాము లేవదు. పైగా తలక్రిందులుగా పడిపోతుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోలో పాము పవర్ఫుల్ యాక్టింగ్‌కు చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాము చేసిన పని చూసి నెటిజన్లు నవ్వుకుంటారు. ఒక పాము కూడా చనిపోయినట్లు యాక్ట్ చేయగలదా అంటూ విస్మయానికి గురవుతున్నారు. ఈ పాము యాక్టింగ్ కు ముచ్చటపడిపోతున్నారు. ఎంత క్యూట్ గా నటించిందో అని మెచ్చుకుంటున్నారు.
ఈ రకం పాములను హాగ్నోస్ స్నేక్స్ అని పిలుస్తారు. ఈ పాములకు నటించడం చిన్నతనం నుంచి స్వతహాగా వస్తుంది. ఇవి తమకు నచ్చినప్పుడు చనిపోయినట్లు ప్రవర్తిస్తాయి. ఈ పాములు అంతగా హానికరమైనవి కావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని కొన్ని దేశాల్లో ఇష్టంగా పెంచుకుంటారు. అయితే ఈ పాముల్లో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయంటున్నారు. అయితే ఆహారం కోసం కప్పలు వంటి వాటిని కన్ఫ్యూజ్ చేసేందుకు ఈ పాములు ఇలాంటి జిమ్మిక్కులను ప్రదర్శిస్తాయంటున్నారు. కేవలం నటించడం మాత్రమే కాదు.. చనిపోయినట్లు ఇతర జీవులను నమ్మించేందుకు ఒకరకమైన వాసనలు వెదజల్లుతాయిట. 3- 4 అడుగుల పొడవు పెరిగే ఈ పాములు న్యూమెక్సికో, టెక్సాస్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.