పేదల కోసమే సర్జికల్ క్యాంప్ : వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: నల్లమల్ల ప్రాంతంలోని పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నానని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. బుధవారం పట్టణంలోని గవర్నమెంట్  హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన మెగా సర్జికల్  క్యాంప్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు. మెగా క్యాంప్ లో 1,230 మంది వివిధ రకాల ఆపరేషన్ల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. 

వారందరికీ హాస్పిటల్  డాక్టర్లతో కలిసి తాను ఆపరేషన్లు చేసి పేద  ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తానని చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా దశలవారీగా ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. 20 మంది డాక్టర్లతో నాలుగు టీమ్​లుగా ఏర్పడి ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. పెద్ద సర్జరీలు అవసరమైతే హైదరాబాద్​లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్​కు పంపించి సర్జరీలు చేపిస్తామని తెలిపారు. 

మూడు నెలలకోసారి సర్జికల్  క్యాంప్​ నిర్వహిస్తామన్నారు. హాస్పిటల్ లో డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్ తో పాటు  వైద్య పరికరాల మంజూరు కోసం మంత్రి  దామోదర రాజనర్సింహా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. హాస్పిటల్  సూపరింటెండెంట్​ ప్రభు, డాక్టర్లు మహేశ్, రాంచందర్, బాల్ సింగ్, శిరీష పాల్గొన్నారు.