గ్రామాల్లో తాగు నీటి సమస్య రావొద్దు : వంశీకృష్ణ

అచ్చంపేట,  వెలుగు : వేసవికాలం  గ్రామాల్లో తాగు నీటిసమస్య రాకుండా చూడాలని  అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం అచ్చంపేట మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ శాంతాబాయి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామాల్లో  సమస్యలను ఆయన  తెలుసుకున్నారు.   పెండింగ్​లో  అభివృద్ధి పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని లేకుంటే  కాంట్రాక్టు రద్దు  హెచ్చరించారు.  మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఎంపీడీవోను  ఆదేశించారు .ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మంత్ర్య నాయక్ ,వైస్ ఎంపీపీ అమరావతి తదితరులు పాల్గొన్నారు.