అచ్చంపేటలో 3కే రన్

అచ్చంపేట, వెలుగు : స్వచ్ఛదనం, పచ్చదనంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని అచ్చంపేట ఎమ్మెల్యే  వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జీఎస్ఎన్  బీఈడీ కాలేజ్  నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు 3 కే రన్ నిర్వహించారు. అంబేద్కర్  చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్  బదావత్  సంతోష్ తో కలిసి మొక్కలు నాటారు. మున్సిపల్  కమిషనర్  శ్యాంసుందర్  పాల్గొన్నారు.