నల్లమలను టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం : చిక్కుడు వంశీకృష్ణ

అమ్రాబాద్, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతానని అచ్చంపేట ఎమ్యెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని మన్ననూర్ ఐటీడీఏను సందర్శించారు. ఈ సందర్భంగా ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో సీరియస్ అయ్యారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి పీవో రోహిత్ గోపిడికి ఫోన్ చేసి సక్రమంగా రికార్డులు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ

వచ్చే నెల 5న ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించి పర్యాటక హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు నివేదికలు సిద్ధం చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఐటీడీఏ అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్లకు సంబంధించి రూ.1.83 కోట్ల అవినీతి జరిగిందని, దానిని వెలికితీసి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

చెంచుల అభ్యున్నతికి కృషి చేస్తామని విద్య, వైద్యం, మౌలిక వసతులతో ఉమ్మడి అమ్రాబాద్ ప్రాంతాన్ని ఆదర్శ ప్రాంతంగా మారుస్తామన్నారు. ఆయన వెంట ఎంపీపీ శ్రీనివాసులు, లీడర్లు హరి నారాయణ గౌడ్, కల్ముల నాసరయ్య, తదితరులు పాల్గొన్నారు.