సైబర్ క్రైమ్ పై అలెర్ట్​ :డీఎస్పీ శ్రీనివాసులు

అచ్చంపేట, వెలుగు: సైబర్ క్రైమ్ పై ప్రతి ఒక్కరూ అలెర్ట్​గా ఉండాలని అచ్చంపేట డీఎస్పీ  శ్రీనివాసులు అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివాస్ ను పురస్కరించుకొని అచ్చంపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని సీనియర్ సిటిజన్లకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ఇటీవల సైబర్ క్రైమ్ పెరిగిపోయిందని సైబర్ క్రైమ్​పై వృద్ధులు మహిళలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అచ్చంపేట సర్కిల్ పరిధిలోని ఎస్సైలు రమేశ్, పవన్ కుమార్, వెంకటరెడ్డి, నాగరాజు, రమాదేవి పాల్గొన్నారు.