బాలికపై లైంగికదాడి..నిందితుడికి పదేండ్ల జైలు

  • సంగారెడ్డి సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు

రామచంద్రాపురం, వెలుగు : బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ సంగారెడ్డి సెషన్స్ కోర్టు (పోక్సో) జడ్జి సోమవారం తీర్పు చెప్పారు. సంగారెడ్డి ఎస్పీ రూపేశ్​తెలిపిన ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​కు చెందిన 5 వ తరగతి చదివే బాలికను అదే కాలనీకి చెందిన  కొట్టంవారి బస్వరాజ్ లైంగికదాడికి పాల్పడినట్టు, బాధితురాలి తల్లి 2019లో  పోలీసులకు కంప్లయింట్ చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చార్జ్​షీట్​ను కోర్టులో దాఖలు చేశారు. కేసును విచారించిన సంగారెడ్డి సెషన్స్ కోర్టు (పోక్సో) జడ్జి కె. జయంతి  సోమవారం తీర్పు ఇచ్చారు. నిందితుడు బస్వరాజ్ కు పదేండ్ల జైలుశిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు. నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.