హైదరాబాద్ శ్రీశైలం హైవేపై ఘోరం: లారీ ఢీకొంటే నుజ్జునుజ్జయిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్ శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలో లారీ ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. శనివారం ( జనవరి 4, 2025 ) చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు వంటి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.