ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 15 మంది మృతి
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది వలస కూలీలు మృతిచెందారు. రాజస్థాన్ కు చెందిన బన్స్వారా జిల్లాకు చెందిన వలస కార్మికులు కిమ్ చార్ రాస్తా వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు వీరిపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం ప్రకటించారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థికసాయం ప్రకటించారు. For More News.. బీజేపీ మాఫియా పార్టీ.. బండి సంజయ్​ అసలు హిందువేనా? రాష్ట్రంలో రోజుకు లక్ష మందికి టీకా రెండో ఏడాదీ అక్కరకు రాని కాళేశ్వరం ప్రాజెక్ట్