మహిళకు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే

  •     10 కిలోల కణితి తొలగింపు

అచ్చంపేట, వెలుగు : అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌‌‌‌‌‌‌‌ వంశీకృష్ణ ఓ మహిళకు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేసి 10 కిలోల కణితిని తొలగించాడు. బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత కడుపులో కణితి పెరగడంతో సంవత్సరం నుంచి బాధపడుతోంది. విషయం అచ్చంపేట ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో గురువారం అచ్చంపేట హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రభుతో కలిసి స్వయంగా ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ చేసి 10 కిలోల కణితిని తొలగించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో అత్యవసర సేవలు అందిస్తుండడంతో ప్రజలు ఎమ్మెల్యేను అభినందిస్తున్నారు.