నాగర్ కర్నూల్ కాంగ్రెస్​దే : మల్లు రవి

అచ్చంపేట, వెలుగు: పార్లమెంట్ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ను కాంగ్రెస్​ పార్టీ గెలుచుకోవడం ఖాయమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ అభ్యర్థి మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం అచ్చంపేట మండలంలోని పల్కపల్లిలో నిర్వహించిన యూత్​కాంగ్రెస్​ సమ్మేళనానికి వారు హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. అనంతరం బల్మూర్ ​మండలం కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నేతలు రామనాథం, గోపాల్​రెడ్డి, రమేశ్​రెడ్డి, నర్సయ్య, వెంకట్​రెడ్డి, ఖదీర్, అల్వాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.