నారాయణ్ ఖేడ్, వెలుగు : నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. కల్హేర్ మండలం మహదేవపల్లి పంచాయతీ సెక్రటరీ ఉమేశ్ ను అదే గ్రామానికి చెందిన బాధితుడు బ్యాంకు లోన్ కోసం ఎంపీడీవో ఆఫీస్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ కావాలని కోరాడు. అందుకు సెక్రటరీ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం బాధితుడి నుంచి సెక్రటరీకి లంచం డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి దొరికాడు. నిందితుడిని హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టు ముందు హాజరు పరిచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు.