అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలో  ఏసీబీ సోదాలు నిర్వహించింది.   ఇటీవలే అమీన్ పూర్ మండలంలోని ఆరు గ్రామాలు మున్సిపాలిటీలో కలిసిన విషయం  తెలిసిందే..  అందులోని ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన గ్రామ సెక్రటరీ  సంఘరీ సచిన్ కుమార్..  ఇంటి నెంబర్ విషయంలో డబ్బులు డిమాండ్ చేయగా  బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో అమీన్ పూర్  మున్సిపాలిటీ ఆఫీసుకు  చేరుకుని సోదాలు చేశారు ఏసీబీ అధికారులు.

20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ  సీనియర్   డ్రాఫ్ట్ మాన్ 

మరో వైపు మహబూబాబాద్ జిల్లా  కలెక్టరేట్ లో  సర్వే,  భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించగా  రూ.20 వేలు లంచం తీసుకుంటూ  ACBకి దొరికారు  సీనియర్  డ్రాఫ్ట్ మాన్ (SDM) అధికారి జ్యోతి. దీనిపై  విచారణ కోనసాగుతోంది.

ALSO READ | హైదరాబాద్కు జస్టిస్ పీసీ ఘోష్.. కాళేశ్వరం విచారణకు కేసీఆర్, హరీశ్.!