కేటీ ఆర్​ఏ1 ఫార్ములాఈ రేసుపై ఏసీబీ కేసు

  • నాలుగు నాన్​ బెయిలబుల్​సెక్షన్ల కింద ఎఫ్​ఐఆర్​
  • నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్‌‌ చేసే చాన్స్
  •  -ఏ 2గా ఐఏఎస్‌‌ అర్వింద్​కుమార్‌‌‌‌, ఏ 3గా రిటైర్డ్‌‌ చీఫ్‌‌ ఇంజనీర్ బీఎల్‌‌ఎన్‌‌రెడ్డి
  • కీలక డాక్యుమెంట్లతో ఎఫ్​ఐఆర్​ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ
  • అసెంబ్లీ ఎన్నికల కోడ్‌‌ ఉన్నప్పుడే సీజన్​ 10 కోసం అగ్రిమెంట్లు.. బ్రిటన్​కు రూ. 46 కోట్లు ట్రాన్స్​ఫర్​ 
  • ఆర్బీఐకి చెప్పకుండా హెచ్​ఎండీఏ అకౌంట్​ నుంచి చెల్లింపులు
  • నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్​ ఆదేశాల మేరకే చేసినట్లు అర్వింద్ అంగీకారం​
  • విదేశాలకు డబ్బు పంపినందుకు ఇప్పటికే రూ.8 కోట్ల ఫైన్​ కట్టిన హెచ్​ఎండీఏ

హైదరాబాద్‌‌, వెలుగు:  ఫార్ములా ఈ– కార్​ రేస్ వ్యవహారంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్​ ప్రెసిడెంట్‌‌  కేటీఆర్‌‌‌‌పై ఏసీబీ కేసు​ నమోదు చేసింది. ఎంఏయూడీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ దాన కిశోర్‌‌ ఫిర్యాదు మేరకు.. 13(1)(ఏ) రెడ్‌‌విత్‌‌, 13(2) ప్రివెన్షన్‌‌ ఆఫ్ కరప్షన్‌‌ యాక్ట్‌‌, 409 రెడ్‌‌విత్‌‌, 120(బి) ఐపీసీ సెక్షన్స్‌‌ కింద గురువారం ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌ చేసింది. రూ. 55 కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడి(ఏ1)గా కేటీఆర్​ను చేర్చింది. రెండో నిందితుడి(ఏ2)గా సీనియర్ ఐఏఎస్‌‌ ఆఫీసర్​ అర్వింద్​కుమార్‌‌‌‌, మూడో నిందితుడి(ఏ3)గా హెచ్‌‌ఎండీఏ మాజీ చీఫ్‌‌ ఇంజనీర్‌‌‌‌ బి.లక్ష్మీనర్సింహారెడ్డిని పేర్కొంది.

దాన కిశోర్​ ఫిర్యాదుతో పాటు సీఎస్ శాంతికుమారికి అర్వింద్​కుమార్‌‌‌‌‌‌‌‌ రాసిన ఎక్స్‌‌‌‌ప్లనేషన్‌‌‌‌ లెటర్.. హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు, మున్సిపల్‌‌‌‌,ఫైనాన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్ల నుంచి సేకరించిన డాక్యుమెంట్లను ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌తో జతపరిచి నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్‌‌‌‌ కోర్టుకు ఏసీబీ అధికారులు అందజేశారు. కేటీఆర్​ సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏసీబీ డీజీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ గురువారం మధ్యాహ్నం అధికారులతో సమావేశమయ్యారు.

ఏసీబీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆధ్వరంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్‌‌‌‌ యూనిట్‌‌‌‌(సీఐయూ)ను ఏర్పాటు చేసి.. జాయింట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు ఇన్‌‌‌‌స్పెక్టర్లు సహా దాదాపు15 మందితో దర్యాప్తు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పోలీసుల నుంచి అవసరమైన సహకారం తీసుకునేందుకు ఉన్నతాధికారుతో చర్చించారు. నాలుగు నాన్‌‌‌‌ బెలబుల్‌‌‌‌ సెక్షన్స్‌‌‌‌ కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.

4 సీజన్లకు రూ.160 కోట్లతో అగ్రిమెంట్‌‌‌‌

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌‌‌‌లో  9, 10, 11, 12 సీజన్లవారీగా ఫార్ములా ఈ– కార్ రేసింగ్‌‌‌‌ నిర్వహించేందుకు యూకేకు చెందిన ఫార్ములా ఈ– ఆపరేషన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(ఎఫ్‌‌‌‌ఈవో), రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఎంఏయూడీ ), ఏస్​ నెక్ట్స్‌‌‌‌ జెన్‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌కు మధ్య 2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 25న ట్రైపార్టీ అగ్రిమెంట్‌‌‌‌ జరిగింది.  దీని విలువ రూ.160 కోట్లు. నెక్ట్స్‌‌‌‌ జెన్‌‌‌‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌ స్పాన్సర్​గా వ్యవహరించగా.. హెచ్​ఎండీఏ మౌలికవసతులు కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించగా.. మౌలిక వసతుల కోసం హెచ్​ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు చేసింది. 

కానీ ఎఫ్‌‌‌‌ఈవో, ఏస్‌‌‌‌ నెక్ట్స్‌‌‌‌ జెన్‌‌‌‌ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో నిర్వహణ బాధ్యతల నుంచి నెక్ట్స్‌‌‌‌ జెన్‌‌‌‌ తప్పుకోవడంతో  సీజన్​10 నిర్వహణకు అప్పటి మున్సిపల్​శాఖ మంత్రి కేటీఆర్​ సూచనల మేరకు ఎంఏయూడీ ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి 2023 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 27న హెచ్‌‌‌‌ఎండీఏ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ హోదాలో అర్వింద్​కుమార్​అప్పటి మున్సిపల్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్ నుంచి అనుమతి పొందారు. 

కోడ్‌‌‌‌ ఉన్నప్పుడే అగ్రిమెంట్​.. యూకేకు మనీ

అగ్రిమెంట్​లో భాగంగా 2023 ఫిబ్రవరిలో 9 సీజన్  ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న సీజన్‌‌‌‌ 10 నిర్వహించాల్సి ఉంది.  ఈ క్రమంలో వివిధ కారణాలతో సీజన్‌‌‌‌ 10 రద్దు చేసుకుంటున్నట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌ సంస్థ 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 27న నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 30న  కొత్త అగ్రిమెంట్‌‌‌‌ జరిగింది. ఈవెంట్‌‌‌‌ నిర్వహణ కోసం  రూ.90 కోట్లు  ఎంఏయూడీ ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ క్రమంలోనే అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 10న అసెంబ్లీ ఎన్నికల కోడ్‌‌‌‌  అమల్లోకి వచ్చి, డిసెంబర్‌‌‌‌ 4 వరకు  కొనసాగింది. 

అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 3న ఫస్ట్​ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కింద రూ.22 కోట్ల 69 లక్షల 63 వేల 125‌‌‌‌ , అక్టోబర్ 11న రెండో ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్‌‌‌‌ కింద రూ. 23 కోట్ల లక్షా 97 వేల 500 రిలీజ్​చేయగా.. హిమాయత్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ ఓవర్‌‌‌‌‌‌‌‌సిస్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ నుంచి యూకేలోని ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ అకౌంట్​కు అక్టోబర్​11న ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ఎలక్షన్‌‌‌‌ కోడ్‌‌‌‌ అమలులో ఉండగానే రూ. 45.71 కోట్లను ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు హెచ్​ఎండీఏ అకౌంట్​ నుంచి యూకేకు డబ్బులు బదిలీ అయ్యాయి.

ALSO READ : ఓఆర్ఆర్ టెండర్​పై సిట్..హరీశ్​రావు కోరిక మేరకు విచారణకు ఆదేశిస్తున్నం

 ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకు ఫండ్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ కావడం వల్ల ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు  హెచ్‌‌‌‌ఎండీఏ  ఫైన్​రూపంలో రూ. 8 కోట్ల 6 లక్షల 75 వేల 404 చెల్లించాల్సి వచ్చింది. దీంతోపాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్​ ఇంటర్నేషనల్​ ఆటోమొబైల్(ఎఫ్​ఐఏ),  ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్​ఎమ్​ఐ)కి  రూ. కోటి 10 లక్షల 51 వేల 14 ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లించింది. ఇలా సీజన్ 10​ కోసం  మొత్తం రూ. 54 కోట్ల 88లక్షల 87 వేల 43ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లింపులు చేసింది.  ఆర్బీఐకి సమాచారం ఇవ్వకుండా, అదీ ఎన్నికల కోడ్​ ఉన్న టైమ్​లో యూకేకు మనీ ట్రాన్స్​ఫర్​ కావడం వెనుక స్కామ్​ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మనీలాండరింగ్​ కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. 

మూడేండ్ల కోసం రూ. 600 కోట్ల అగ్రిమెంట్​!

ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసిన డబ్బుకు సంబంధించి ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ నుంచి కూడా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిధుల మళ్లింపుపై కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక హెచ్‌‌‌‌ఎండీఏ, మున్సిపల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ అంతర్గత విచారణ జరిపారు. గతంలో జరిగిన అగ్రిమెంట్స్‌‌‌‌ను పరిశీలించారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కి నోటీసులు జారీ చేశారు. 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 30న చేసుకున్న అగ్రిమెంట్ కుట్రపూరితమని తేల్చారు. ఫార్ములా ఈ– కార్ రేస్‌‌‌‌ కోసం మూడేండ్లకు గాను మొత్తం రూ.600 కోట్లు అగ్రిమెంట్‌‌‌‌ చేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆధారాలు సేకరించారు. అనధికారికంగా రూ.46 కోట్లు ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు చెల్లించినట్లు గుర్తించారు.

కేటీఆర్​ ఆదేశాల మేరకే..

హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలని సీఎస్‌‌‌‌ శాంతికుమారి జనవరి 6న ఐఏఎస్‌‌‌‌ అధికారి అర్వింద్​ కుమార్‌‌‌‌‌‌‌‌కు మెమో జారీ చేసింది. దీనికి వివరణ ఇస్తూ జనవరి 24న ఆయన సీఎస్‌‌‌‌కు ఎక్స్‌‌‌‌ప్లనేషన్ లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌, ఎక్స్‌‌‌‌ నెక్ట్స్‌‌‌‌ జెన్‌‌‌‌ సహా ఎంఏయూడీ ఒప్పందాలు, డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేసిన వివరాలను వెల్లడించారు. అప్పటి మున్సిపల్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ కేటీఆర్​ ఆదేశాల మేరకే హెచ్‌‌‌‌ఎండీఏ బోర్డు నిధులను ఫార్ములా ఈ ఆపరేషన్స్‌‌‌‌కు చెల్లించినట్లు వివరించారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 18న ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో రంగంలోకి దిగిన ఏసీబీ.. అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించింది. 

కేటీఆర్​ చుట్టే ఈ వ్యవహారం నడవడం.. ఆయన ఎమ్మెల్యే కావడంతో..  ఆయనను విచారించేందుకు గవర్నర్​ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్​ ప్రాసిక్యూషన్​కు అనుమతివ్వాలని కోరుతూ ప్రభుత్వం గవర్నర్​కు లెటర్​ రాయగా.. ఇటీవలే అనుమతి లేఖను సీఎస్‌‌‌‌కు గవర్నర్​  పంపారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మంగళవారం సీఎస్‌‌‌‌ నుంచి ఏసీబీకి ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగానే దాన కిశోర్‌‌‌‌‌‌‌‌ బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు.  

ఆర్బీఐకి చెప్పకుండా  విదేశాలకు ఫండ్స్​ ట్రాన్స్​ఫర్​

ఆర్బీఐకి సమాచారం లేకుండా విదేశాలకురూ. 45.71 కోట్లు  ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసినందు కు హెచ్​ఎండీఏకు ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌ మెంట్‌‌‌‌ రూ.8 కోట్ల 6 లక్షల 75 వేల 404 ఫైన్​ వేసింది. దీంతోపాటు వివిధ ఫీజుల రూపంలో ఫెడరేషన్​ ఇంటర్నేషనల్​ ఆటోమొబైల్,  ఫెడరే షన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా కు మరో రూ. కోటి 10 లక్షల 51 వేల 14 ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లించింది. ఇట్ల ఫార్ములా ఈ రేస్​ సీజన్ 10​ కోసం మొత్తంగా రూ.54 కోట్ల 88 లక్షల 87 వేల 43ను హెచ్‌‌‌‌ఎండీఏ చెల్లింపు లు జరిపింది. హెచ్‌‌‌‌ఎండీఏ రూల్స్​ ప్రకారం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే ప్రభు త్వం, ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. కానీ.. నాడు ఈ నిబంధనలేవీ పట్టించుకోలేదు.