వికారాబాద్ జిల్లాలో ఐదు లక్షల రూపాయలతో పట్టుబడ్డ అధికారులు

ఏసీబీ అధికారుల వరుస దాడులలో అవినీతి తిమింగళాలు బయటపడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంపై ఏసీబీ అదికారులు దాడులు జరిపారు.


ఈ దాడులలో ఏఓ (AO) దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు లంచం తీసుకుంటూ పడ్డబడ్డారు. 5 లక్షల రూపాయల నగదును తీసుకుంటూ అధికారులు పట్టుబడటంతో అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పథకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడులు చేసి అవినీతి అధికారులను పట్టుకున్నారు. పట్టుబడిన అధికారులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

ALSO READ | మిషన్ భగీరథ ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్