యూనివర్సిటీలలో వీసీలను నియమించాలి : ఏబీవీపీ నాయకులు

మహబూబ్ నగర్  రూరల్​, వెలుగు: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వెంటనే వీసీలను నియమించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం పీయూ మెయిన్  గేట్  ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ ప్రెసిడెంట్  కృష్ణ కుమార్  మాట్లాడుతూ నెల రోజుల్లో కొత్త వీసీలను నియమిస్తామని చెప్పి మూడు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. జైపాల్, బాల శివసాయి, నీరేశ్, సతీశ్, కృష్ణ కుమార్, వేణు, కేశవులు, సందీప్  పాల్గొన్నారు.