
బ్రిగిడ సాగా... అంటే ఆ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, పవి టీచర్.. అనగానే గుర్తొచ్చేస్తుంది ఈ చేప కళ్ల అమ్మాయి. ఒకే ఒక్క తమిళ వెబ్ సిరీస్‌లో పవి టీచర్ పాత్రలో నటించిన ఆమె. కళ్లతో మాయ చేసి తన పర్ఫార్మెన్స్కు గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా ‘సిందూరం’. కానీ, అంతకుముందే పవి టీచర్‌గా తెలుగు వాళ్లకు పరిచయమే. ‘గ్లామర్ పాత్రలకు నేను దూరం. యాక్టర్‌కి కావాల్సింది ఎక్స్ప్రెషన్స్ బాగా పలికించడమే’ అంటోంది ఈ తమిళమ్మాయి. ఫిల్మ్ మేకర్ కావాలనుకున్న పవి టీచర్ యాక్ట్రెస్ ఎలా అయ్యిందో? ఆమె మాటల్లోనే...
‘‘నేను పుట్టి పెరిగింది చెన్నైలో. అక్కడే లయోలా కాలేజీలో బిఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశా. ఆ తర్వాత ఫిల్మ్ మేకింగ్ మీద ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలనుకున్నా. నేను నటించాలి అని అస్సలు అనుకోలేదు. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుందామని ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ టైంలో ఒకే ఏడాది (2019)లో ‘అవలొడు అవన్, కన్ పేసుమ్ వార్తైగల్, తోల్ కోడు’ అనే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించా. వాటితోపాటు ‘ఆహా కళ్యాణం’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించా. ఆ తర్వాత ‘అయోగ్య, మాస్టర్, వెలన్’లలో చిన్న రోల్స్ చేశా. అవి చేస్తూనే మరో సినిమాకి అసిస్టెంట్‌గా చేరాలని ట్రై చేశా. ఆ మూవీ టీం నన్ను చూసి ‘హీరోయిన్ క్యారెక్టర్ చేస్తావా?’ అని అడిగారు. ఆ విషయం ఇంట్లో వాళ్లకు చెప్తే, వాళ్లు కూడా ‘ఓకే’ అన్నారు. అలా అనుకోకుండా యాక్ట్రెస్నయ్యా. అదే ‘ఇరవిన్ నిళల్’ (2022).
సింగిల్ టేక్ మూవీ
‘ఇరవిన్ నిళల్’ తమిళంలో హీరోయిన్గా చేసిన మొదటి సినిమా. ఒక ఎక్స్పరిమెంట్ మూవీ అది. అందులో నేను తెలుగమ్మాయి పాత్రలో నటించా. క్యారెక్టర్ పేరు ‘చిలకమ్మ’. అప్పటి నుంచే తెలుగుతో నాకు ఒక బంధం ఏర్పడింది అనిపిస్తుంది ఇప్పుడు. ఆ సినిమా చూసి రజినీకాంత్, కమల్‌హాసన్ వంటి పెద్ద హీరోలు ఫోన్ చేసి, ‘చిలకమ్మ క్యారెక్టర్ చేసిన అమ్మాయి నటన చాలా బాగుంది. మంచి ఫ్యూచర్ ఉంది’ అని చెప్పారు. ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఆయన కూడా నా నటన మెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రపంచంలోనే మొదటి సింగిల్ షాట్ మూవీ. అందులో నేను నటించడం చాలా గర్వంగా అనిపించింది. ఆ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించారు. అలాగే ఈ సినిమాకి ‘ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఫస్ట్ ఏసియన్ సింగిల్ షాట్ మూవీగా రికార్డులకెక్కింది. ఈ మూవీలో సింగిల్ షాట్స్ అన్నీ కలిపి 1,36,228 ఫ్రేమ్స్ ఉన్నాయి. ‘ఇరవిన్ నిళల్’ ఆస్కార్ ఎలిజిబిలిటీ లిస్ట్‌లో కూడా స్థానం సంపాదించింది.
పవి టీచర్‌గా...
‘ఆహా కళ్యాణం’ (2019) అనే వెబ్ సిరీస్‌లో నా క్యారెక్టర్ పేరు ‘పవిత్ర (పవి) టీచర్’. ఆ సిరీస్ బాగా హిట్ అయింది. దాంతో నన్ను అందరూ ‘పవి టీచర్’ అనే పిలుస్తున్నారు. చాలామందికి నా అసలు పేరు కూడా తెలియదు. ఆ సిరీస్ తెలుగువాళ్లు కూడా చూశారు. ఇక్కడ కూడా చాలామంది నన్ను అభిమానించారు. పవి క్యారెక్టర్‌కి మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ తర్వాత చాలా పేరొచ్చింది. ‘సిందూరం’ సినిమాలో ఆఫర్ కూడా ‘పవి టీచర్’ వల్లే. ఆ సిరీస్‌లో నా యాక్టింగ్ చూసి ప్రొడ్యూసర్ ప్రవీణ్, డైరెక్టర్ శ్యామ్‌కి నా గురించి చెప్పి, ఆ వీడియో చూపించారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి, డైరెక్టర్ స్క్రిప్ట్ నెరేట్ చేస్తారని చెప్పారు. కథ విన్నాక నాకు చాలా నచ్చింది. ఇందులో కాన్సెప్ట్‌తో పాటు నా పర్ఫార్మెన్స్కి కూడా స్కోప్ ఉంది. కాబట్టి వెంటనే ఒప్పుకున్నా. ఎందుకంటే చాలామందికి ఇలాంటి అవకాశం రాదు. పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఈ క్యారెక్టర్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే... ‘సిందూరం’ సినిమా షూటింగ్లో నేను తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టా. సెట్లో అందరూ మాట్లాడుతుంటే విని... నేను మాట్లాడ్డానికి ట్రై చేశా. తెలుగులో డైలాగ్స్ చెప్పడం డైరెక్టర్, డైరెక్షన్ టీం, హీరో ధర్మ నేర్పించారు. వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అందుకే వాళ్లు నాకు డైలాగ్స్ చెప్పినప్పుడు ప్రతిపదానికి అర్థం అడిగి తెలుసుకునేదాన్ని. అలా ఆ డైలాగ్ నేర్చుకుని చెప్పేదాన్ని.
ఆ సీన్ కాంట్రవర్సీ అయింది
నా మొదటి సినిమాలో నేను దేవుడి గుడి దగ్గర పూలు అమ్మే అమ్మాయి పాత్రలో నటించా. ఆ సినిమాలో నా భర్త కోసం కొందరు నన్ను కిడ్నాప్ చేస్తారు. అక్కడ వాళ్లు నన్ను బట్టలు లేకుండా గోడ వెనక కూర్చోబెడతారు. ఆ సీన్లో నా ముఖం, కాళ్లు మాత్రమే కనిపిస్తాయి. అంతకుమించి ఎక్కడా ఎక్స్పోజింగ్ లేదు. సినిమా చేసేటప్పుడు కూడా నేను కంఫర్ట్‌గానే చేశా. సినిమా రిలీజ్ అయ్యాక, రెండు రోజుల వరకు బాగానే ఆదరించారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాయడం మొదలుపెట్టారు. అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. బహుశా వాళ్లు సినిమా చూడకుండా ఆ కామెంట్లు పెట్టి ఉండొచ్చు. కానీ, సినిమా మొత్తం చూస్తేనే, ఆ సీన్ ఏంటనేది అర్థమవుతుంది. అందులో ఎలాంటి తప్పు లేదు.
డైరెక్టర్ నాకు ఆ సీన్ చెప్పినప్పుడు నేను కూడా కొంచెం ఆలోచించా. ఎందుకంటే నాకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. అలాంటిది మొదటి సినిమాలోనే ఇలాంటి సీన్ చేయాలంటే కొంచెం నెర్వస్ ఫీలయ్యా. ఆ టైంలో డైరెక్టర్ పార్తిబన్ నాకు ధైర్యమిచ్చారు. అప్పటికీ నా ఫ్యామిలీకి ఈ విషయం ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తుంటే.. అప్పుడు కూడా ఆయనే మా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసి, కన్విన్స్ చేశారు. ఆ సీన్ కాంట్రవర్సీ అవ్వడం చాలా బాధగా అనిపించింది. దాన్నుంచి బయటపడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
యాక్టింగ్ కాకుండా
మా నాన్న డాన్సర్. ఆయన దగ్గర డాన్స్ నేర్చుకున్నా. నాన్న డాన్స్ క్లాస్‌లు చెప్పేవాళ్లు. ఒకప్పుడు డాన్స్ క్లాస్ బ్రాంచ్‌లు కూడా ఉండేవి. ఇప్పుడు ఏం లేవు. నాన్న నా దగ్గరే ఉంటున్నారు. నాకు పాటలు పాడటం కూడా ఇష్టం. చిన్నప్పుడు కర్నాటిక్ సింగింగ్ క్లాసులకు వెళ్లేదాన్ని. తొమ్మిదో తరగతి మధ్యలో టెన్త్ పోర్షన్ చెప్పడం మొదలుపెట్టడంతో సంగీతం క్లాసులకు వెళ్లడం మానేశా. మళ్లీ అటు వైపు వెళ్లే అవకాశమే రాలేదు. మా అమ్మ నుంచి యాక్టింగ్ వచ్చింది. అమ్మ నాటకాల్లో నటించేవాళ్లు. అప్పుడప్పుడు డ్రాయింగ్ చేస్తా. అయితే ఇవెన్ని చేసినా నాకు మాత్రం ఫిల్మ్ మేకింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలనేది నా డ్రీమ్.’’::: ప్రజ్ఞ
యాక్టింగ్‌కి భాష అక్కర్లేదు. నటన అంటే ఎమోషన్ని ఎక్స్‌ప్రెస్ చేయడమే. కాబట్టి నాకు భాష గురించి భయం లేదు. కానీ, నా క్యారెక్టర్‌కు నేను ఎంత వరకు న్యాయం చేయగలను? అనేది చూసుకుంటా. ఆ విషయంలో కొంచెం భయంతో ఉంటా. నాకు ఎక్స్ప్రెషన్స్ బాగా పలకడానికి కారణం నా కళ్లే. చాలామంది ‘నీ కళ్లు బాగుంటాయి. నీ యాక్టింగ్ కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు.