ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది కేంద్రం. విద్యార్థుల తరలింపు కోసం 3 రోజుల పాటు 26 విమానాలు నడిపించబోతున్నట్టు చెప్పారు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా....ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ- 17 రోమేనియాకు వెళ్లింది. ఉదయం 4 గంటలకు ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ లోని హిందాన్ ఎయిర్ బేస్ నుంచి బయల్దేరి వెళ్లినట్లు తెలిపారు అధికారులు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం ఫుడ్, వాటర్ బాటిళ్లతో వెళ్లింది సీ-17 విమానం. ఉక్రెయిన్ నుంచి 24 గంటల వ్యవధిలోనే మరో 6 విమానాలు భారత్ కు రానున్నాయన్నారు విదేశాంగ మంత్రి జై శంకర్. ఆ విమానాల్లో వెయ్యి 377 మంది వస్తున్నారన్నారు.
#WATCH Indian Air Force aircraft carrying tents, blankets and other humanitarian aid to take off from Hindon airbase shortly#Ukraine pic.twitter.com/gNNnghETQr
— ANI (@ANI) March 2, 2022
ఉక్రెయిన్ లో చిక్కుకున్న 220 మందిని విమానంలో ఇస్తాంబుల్ మార్గంలో ఢిల్లీకి వచ్చారు. ఎయిర్ పోర్టులో విద్యార్థులకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో దిగగానే.. భారత్ మాతా కీ జై అని నివాదాలు చేశారు విద్యార్థులు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను పర్యవేక్షించేందుకు రుమేనియా రాజధాని బుచారెస్ట్ చేరుకున్నారు కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా. మరో కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పురి హంగేరీ రాజధాని బుడాపెస్ట్ వెళ్లారు. రెస్జోలో కేంద్రమంత్రి వీకే సింగ్.. విద్యార్థులకు సెండాఫ్ ఇచ్చారు.
#WATCH "Bharat Mata Ki Jai" chants by Indians returning from war-torn Ukraine, at Delhi airport.
— ANI (@ANI) March 2, 2022
Union Minister Dr Jitendra Singh received the Indians who returned on a special flight today. pic.twitter.com/GfFPmDC6Kt
మరిన్ని వార్తల కోసం
ఈ యాప్ తో ర్యాగింగ్ ను అడ్డుకోవచ్చు
జోరుగా గోద్రెజ్ జెర్సీ పాల అమ్మకాలు
