సన్ రైజర్స్ ఓపెనర్.. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ లోనే చెలరేగే ఈ పంజాబ్ ఓపెనర్ ఇక దేశవాళీ క్రికెట్ లీగ్ లో అంతకుమించి చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 29 బంతుల్లో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు.. 11 సిక్సర్లు ఉన్నాయి.
అభిషేక్ శర్మ 28 బంతుల్లో సెంచరీ చేయడంతో అతను వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా గుజరాత్ కు చెందిన ఉర్విల్ పటేల్ రికార్డ్ ను సమం చేశాడు. గత వారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే ఉర్విల్ 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఓవరాల్ గా టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. ఈ ఏడాది ప్రారంభంలో సైప్రస్‌పై ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో సెంచరీ చేశాడు.
ALSO READ : టీమిండియాతో రెండో టెస్ట్.. ప్లేయింగ్ 11 ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన మేఘాలయ 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ సూపర్ షో కారణంగా పంజాబ్ 143 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి ఛేదించగలిగింది. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
HUNDRED BY ABHISHEK SHARMA IN SMAT...!!! ?
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 5, 2024
- A century in just 28 balls with 7 fours and 11 sixes. A blistering knock by the Punjab captain while chasing 143. ?? pic.twitter.com/PBmc2qggvw