12 ఏళ్ల వయస్సులో పిల్లలు..సరదాగా ఆటలు ఆడుతూ గడిపేస్తుంటారు. కానీ న్యూజెర్సీకి చెందిన అభిమన్యు మిశ్రా మాత్రం ఆ ఆటతోనే రికార్డులు తిరగరాశాడు.12ఏళ్ల 4నెలల 25 రోజుల వయస్సులోనే గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న అభిమన్యు...అంతకుముందు ఈ ఘనత సాధించిన చెస్ ప్లేయర్ కర్జాకిన్ రికార్డు బద్దలు కొట్టాడు. అభిమన్యు మిశ్రా తల్లిదండ్రులు ఇండియాకు చెందిన వారే. చిన్న వయస్సులోనే చెస్ పై పట్టు సాధించిన అభిమన్యు...9 ఏళ్ల వయస్సులోనే US అతి పిన్న జాతీయ చెస్ మాస్టర్ గా నిలిచాడు. 10 ఏళ్ల 9 నెలల వయస్సులో అంతర్జాతీయ చెస్ మాస్టర్ గా నిలిచి భారత్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రికార్డును బ్రేక్ చేశాడు. ఏడాది పాటు కరోనా కారణంగా ఆటకు దూరంగా ఉన్నాడు అభిమన్యు. లేకపోతే మరింత చిన్నవయస్సులోనే ఈ రికార్డు సాధించేవాడు.
మధ్యప్రదేశ్ కు చెందిన హేమంత్, స్వాతి దంపతులు 2006లో అమెరికాలో స్థిరపడ్డారు. తమ కొడుకును చెస్ ఛాంపియన్ గా చూడాలనేది ఆ తల్లిదండ్రుల కోరిక. అభిమన్యుకు పూర్తిగా మాటలు రాకముందే రెండున్నరేళ్ల వయస్సులోనే చెస్ పావులను పరిచయం చేశాడు తండ్రి. అలా క్రమంగా చెస్ పై ప్రేమ పెంచుకున్న అభిమన్యు అకాడమీలో చేరి చెస్ పై పట్టు సాధించాడు. తనకంటే పెద్దవాళ్లతో ఆడి వారిని ఓడించాడు. అండర్-9 విభాగంలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ కలిగిన ఆటగాడిగా నిలిచిన అతనికి దిగ్గడం కాస్పరోవ్ చెస్ ఫౌండేషన్ నుంచి పిలుపు వచ్చింది. ఆ సంస్థ నిర్వహించిన యంగ్ స్టార్స్ కార్యక్రమానికి అభిమన్యు ఎంపికయ్యాడు. దీంతో అప్పటి నుంచి అభిమన్యు ఆటతీరును పరిశీలించి ఏడాదికి రెండు సార్లు కాస్పరోవ్ తగిన సలహాలు సూచనలు అందించాడు.
Hungary| Final game was a very tight game & somehow I was able to win that. It felt like this huge pressure & everything finally got lifted off because we were here for the last 2.5 months: Abhimanyu Mishra, 12-year-old, the youngest chess grandmaster pic.twitter.com/d8zESdqsvN
— ANI (@ANI) July 3, 2021
