హైదరాబాద్, వెలుగు: బస్ టికెట్లను ఆన్లైన్లో అందించే అభీబస్ ఇక నుంచి తూర్పు రాష్ట్రాల్లోనూ సేవలు అందించనుంది. ఇందుకోసం బిహార్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్తో చేతులు కలిపింది. అభీబస్ వెబ్సైట్/యాప్ ద్వారా ఢిల్లీ, ఆగ్రా, లక్నో, కాన్పూర్, అలాహాబాద్, ఘజియాబాద్, బుద్ధగయ, ఔరంగాబాద్, వారణాసి, నవాడా, పూర్ణియా లాంటి ప్రాంతాలకు స్లీపర్, నాన్ స్లీపర్, ఏసీ, నాన్ ఏసీ టికెట్లు ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చు. బిహార్ రవాణా సంస్థ రూట్లల్లో నడిచే అన్ని బస్సుల టికెట్లను ఇకపై అభీబస్ ద్వారా కొనుక్కోవచ్చు. బీఎస్ఆర్టీసీ బస్సులు బిహార్, యూపీ, ఢిల్లీలో నడుస్తాయి.
