షాన్ మసూద్‌‌, షఫీక్‌‌ సెంచరీలు

ముల్తాన్‌‌ : కెప్టెన్ షాన్ మసూద్‌‌ (151), ఓపెనర్‌‌‌‌ అబ్దుల్లా షఫీక్‌‌ (102)  సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్‌‌తో మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌ ఎంచుకున్న పాక్ తొలి రోజు, సోమవారం చివరకు 328/4 స్కోరు చేసింది. మరో ఓపెనర్ సైమ్ ఆయుబ్ (4)ను మూడో ఓవర్లోనే అట్కిన్సన్ ఔట్‌‌ చేసినా.. మసూద్‌‌, షఫీక్‌‌ రెండో వికెట్‌‌కు 253 రన్స్‌‌ జోడించారు. 

అట్కిన్సన్‌‌ బౌలింగ్‌‌లో షఫీక్‌‌ పెవిలియన్‌‌ చేరగా.. కాసేపటికే మసూద్‌‌ స్పిన్నర్‌‌‌‌  జాక్‌‌ లీచ్‌‌కు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చాడు.  బాబర్ ఆజమ్ (30) తక్కువ స్కోరుకే ఔటవగా. సౌద్ షకీల్ (35 బ్యాటింగ్‌‌), నసీమ్‌‌ షా (0 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ రెండు, క్రిస్ వోక్స్‌‌, జాక్ లీచ్‌‌ చెరో వికెట్‌‌ పడగొట్టారు.