రంజీ ట్రోఫీలో సన్ రైజర్స్ యువ బ్యాటర్ అబ్దుల్ సమద్ చెలరేగి ఆడుతున్నాడు. బారాబతి స్టేడియంలో ఒడిశాపై జరుగుతున్న మ్యాచ్ లో ఈ 22 ఏళ్ళ బ్యాటర్ రికార్డుల వర్షం కురిపించాడు. జమ్మూ,కాశ్మీర్ తరపున ఆడుతూ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు బాదేశాడు. దీంతో ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్‌లో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు కొట్టిన మొదటి జమ్మూ,కాశ్మీర్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సమద్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తొలి ఇన్నింగ్స్ లో సమద్ కేవలం 117 బంతుల్లో 127 పరుగులు చేశాడు. వీటిలో 9 సిక్సర్లు, 6 ఫోర్లున్నాయి. జట్టు మొత్తం చేసిన 270 పరుగులో సమద్ ఒక్కడే 127 పరుగులు చేయడం విశేషం. మిగిలినవారు ఎవరూ కూడా కనీసం 40 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు, ఐదు బౌండరీలతో 108 పరుగులు చేశాడు. సమద్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 15 సిక్సర్లు బాదేశాడు.
Also Read :- 300 వికెట్ల క్లబ్‌లో రబడా.. పాక్ దిగ్గజాన్ని దాటి ప్రపంచ రికార్డ్
సమద్ మెరుపులతో జమ్మూ కాశ్మీర్ 7 వికెట్లకు 270 పరుగుల వద్ద తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసి కష్టాల్లో పడింది. అంతక ముందు జమ్మూ తొలి ఇన్నింగ్స్ లో 270 పరుగులు చేస్తే ఒడిశా 272 పరుగులకు ఆలౌటైంది.
Abdul Samad is lighting up the Ranji Trophy 2024-25 with his explosive form.?
— CricTracker (@Cricketracker) October 21, 2024
He first scored 127(117) in the first innings and followed it up with an unbeaten 108(108) in the second innings against Odisha, smashing 15 sixes and 11 fours.
?: BCCI Domestic pic.twitter.com/98ifWIaeof