యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తొలిసారి డాక్టర్ల అవరసరం లేకుండా అత్యవసరంగా కరోనా టెస్ట్ చేసుకునేలా ఓ కంపెనీ తయారు చేసిన కరోనా టెస్టింగ్ కార్డ్ కు అనుమతిచ్చింది.
అచ్చం ఏటీఎంలా ఉండే ఈ కరోనా టెస్టింగ్ కార్డ్ ను అబాట్ అనే కంపెనీ అబాట్ బైనాక్స్ నౌ కొవిడ్-19 ఏజీ కార్డ్ ను విడుదల చేసింది.
రూ. 370 విలువైన ఈ కార్డ్ ను ఉపయోగించి నిమిషాల వ్యవధిలో కరోనా సోకిదా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ తరహాలో ఈ కరోనా ఫలితాల్ని తెలుసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎనలైజర్ అవసరం లేదు. ఈ కార్డ్ తో కరోనా టెస్ట్ చేసుకొని పాజిటీవ్ వస్తే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా యూఎస్ ఎఫ్ డీఏ సెంటర్ ఫర్ డైరక్టర్ జేడీ షురెన్ మాట్లాడుతూ కరోనా టెస్ట్ లు మరింత వేగవంతం కానున్నాయి. ఎందుకంటే ఈ కార్డ్ ద్వారా నిమిషాల్లో రిజల్ట్ ను తెలుసుకోవచ్చన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యల్లో అబాట్ కంపెనీ ఉత్పత్తి చేస్తుందన్నారు.
అది ఎలా పని చేస్తుంది
ఎఫ్ డీఏ అనుమతిచ్చిన ఈ అబాట్ బైనాక్స్ కోవిడ్ -19 కార్డ్ ను ముక్కునుంచి కారే స్రవాల ద్వారా కరోనా సోకిందా లేదా అని తెసుకోవచ్చు.
ఎక్కడ ఉపయోగించవచ్చు
ఈ కార్డ్ ను డాక్టర్లు, స్కూల్స్ ఇలా అత్యవసర ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ కార్డ్ ఉత్పత్తి ప్రారంభదశలో ఉందని రాబోయే రోజుల్లో అంటే అక్టోబర్ ప్రారంభం నుంచి నెల పూర్తయ్యే లోపల మొత్తం 50 మిలియన్ల కార్డ్ లను అందుబాటులోకి తెచ్చేందుకు అబాట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
