అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పతకాల బోణీ

లిమా :  వరల్డ్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌–20 అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పతకాల బోణీ చేసింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 10 వేల మీటర్ల రేస్‌‌‌‌‌‌‌‌ వాక్‌‌‌‌‌‌‌‌లో ఆరతి 44ని.39.39 సెకన్లతో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. చైనా వాకర్లు జువోమా బైమా (43:26.60 సెకన్లు)

మిలింగ్‌‌‌‌‌‌‌‌ చెన్‌‌‌‌‌‌‌‌ (44:30.67 సెకన్లు) వరుసగా గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌ గెలిచారు. హై జంప్‌‌‌‌‌‌‌‌లో పూజా సింగ్‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌ రికార్డు (1.82 మీ)ను బద్దలు కొట్టి ఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో పూజ 1.83 మీటర్ల ఎత్తును క్లియర్‌‌‌‌‌‌‌‌ చేసింది.