ఆరా ఎగ్జిట్ పోల్స్ : ఏపీలో వైసీపీదే విజయం

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఆరా సర్వే సంస్థ యజమాని మస్తాన్ వెల్లడించారు. 2024, జూన్ ఒకటో తేదీన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో హోరాహోరీగా సాగిన పోలింగ్ లో.. వైసీపీదే ఆధిక్యం అని.. ఈ విషయం 22 రోజుల పరిశీలన తర్వాత అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లతో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తున్నట్లు చెప్పారు మస్తాన్.
టీడీపీ కూటమి 71 నుంచి 81 మధ్య సీట్లను గెలుస్తుందని వెల్లడించారాయన.
టీడీపీ కూటమి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనంగా 25 సీట్లు రాబోతున్నాయని సర్వేలో వెల్లడైనట్లు వివరించారు ఆరా మస్తాన్

ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 15 లోక్ సభ సీట్లలో గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్.. టీడీపీ కూటమి 10 నుంచి 12 సీట్లలో గెలవబోతుందని వివరించారాయన. జనసేన పార్టీ పోటీ చేసిన రెండు పార్లమెంట్ సీట్లలో ఆ పార్టీనే విజయం సాధిస్తుందని వివరించారు. 

వైఎస్ షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ఓట్లను భారీ చీల్చిందని.. దీని వల్ల మూడు పార్లమెంట్ సీట్లను వైసీపీ కోల్పోవాల్సి వస్తుందని.. ఇది ఆ పార్టీకి నష్టం చేకూర్చిందన్నారు ఆరా సర్వే మస్తాన్.