నాలుగింట మూడొంతుల మెజారిటీలో ఆప్

నాలుగింట మూడొంతుల మెజారిటీలో ఆప్

పంజాబ్‌లో ఆప్ విజయ ఢంకా మోగించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ నాలుగింట మూడొంతుల మెజారిటీతో ఆప్‌ విజయం సాధించింది. ప్రధాన పార్టీలన్నింటిని వెనక్కి నెట్టి విజయం వైపు దూసుకెళ్లింది. సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల కమిషన్ అందించిన వివరాల ప్రకారం... ఆప్ పంజాబ్‌‌లో89 సీట్లు గెలుచుకుంది. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇదే సమయంలో పంజాబ్‌లో నిన్నమొన్నటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాల్లో మాత్రమే గెలిచింది. SAD-BSP కంబైన్డ్ పార్టీ కేవలం నాలుగు సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది. ఇక ఇండిపెండెంట్లు మరో రెండు చోట్ల గెలుపొందారు.

ఇవి కూడా చదవండి:

పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమి కి కారణం సిద్దూ

చన్నీని ఓడించిన లాభ్ సింగ్ ఎవరంటే..?