పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు షాక్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు షాక్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు గట్టి షాక్ తగిలింది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేసిన భగవంత్ మాన్ సీఎం పీఠాన్ని అధిరోహించారు. సంగ్రూర్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవలే ఉప ఎన్నికలు నిర్వహించారు. జూన్ 26వ తేదీ ఆదివారం ఫలితాలను లెక్కించారు. ఆప్ తరపున బరిలోకి దిగిన గుర్మైల్ సింగ్ (Gurmail Singh) పక్కా విజయం సాధిస్తారని అందరూ ఊహించారు. కానీ ఓట్ల లెక్కింపులో షాక్ తగిలింది. శిరోమణి అకాలీదళ్ (SAD-A) పార్టీ తరపున ఉన్న Simranjit Singh Mann విజయం సాధించారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపారు. మధ్నాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది ఫలితాలు వెలువడ్డాయి. ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. చివరకు ఆప్ అభ్యర్థి గుర్మైల్ పై శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి 6 వేల 800 ఓట్ల తేడాతో గెలుపొందారు. మూడు లోక్ సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాల్లో సంగ్రూర్ కూడా ఉంది. ఈ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు నెలల మన్ నేతృత్వంలోని ప్రభుత్వం పట్ల ప్రజలు అంతగా ఆదరించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంగ్రూర్ లో ఓటమిపై ఆప్ ఎలా స్పందిస్తుందో చూడాలి.