ఢిల్లీ సీఎం బంగ్లా దగ్గర హై టెన్షన్: ఆప్ నేతలు ఢిల్లీ పోలీసుల మధ్య ఘర్షణ

ఢిల్లీ సీఎం నివాసంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతో ఆప్ నేతలు, ఢిల్లీ పోలీసులకు మధ్య బుధవారం (జనవరి 8, 2025 ) వాగ్వాదం చోటుచేసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ హయాంలో బంగ్లాను ‘షీష్ మహల్’గా మార్చారన్న బీజేపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ఆప్ నేతలు ముఖ్యమంత్రి నివాసంలో మీడియా టూర్ ప్లాన్ చేసిన క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆప్ నేతలు లోపలికి వెళ్లకుండా సీఎం నివాసం దగ్గర బారీకేడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు పోలీసులు.

సీఎం నివాసంలోకి వెళ్లేందుకు తమకు పర్మిషన్ ఎందుకు కావాలని ప్రశ్నించారు ఆప్ ఎమ్మెల్యేలు, మంత్రులు. తమను అడ్డుకోమని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారా అంటూ ప్రశ్నించారు మంత్రి భరద్వాజ్. ఈ క్రమంలో పోలీసులకు, ఆప్ నేతల మధ్య వాగ్వాదంతో ఢిల్లీ సీఎం నివాసం దగ్గర హై టెన్షన్ నెలకొంది.