బాలీవుడ్ హీరోయిన్ కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తన ముద్దుల కుమారుడు ఆదిత్య ఠాక్రేని కాపాడేందుకు తనని కార్నర్ చేస్తున్నారని మండిపడ్డారు.
హిమాచల్ ప్రదేశ్ వెళ్లేముందు కంగన రనౌత్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య సినీ మాఫియా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హంతకుల్ని కనెక్ట్ చేసిన డ్రగ్ రాకెట్ తో బేటీ అయ్యారని తెలిపారు.
ముంబైపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై అక్రమ నిర్మాణాలంటూ బీఎంసీ తన కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చివేసిందని, తాను చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం కలత చెందారని అన్నారు.
మహారాష్ట్ర సీఎం నన్ను టార్గెట్ చేయడానికి కారణం. నేను సినిమా మాఫియా, ఎస్ఎస్ఆర్ హంతకులు,స్మగ్లర్లను బహిర్గతం చేశాను. వారిలో ఉద్దవ్ ఠాక్రే ప్రియమైన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఉన్నారని కంగన ఆరోపించారు.
