జాకీ షోరూంలో.. కళ్ల ముందే కుప్పకూలి.. నిమిషంలోనే చనిపోయిన కుర్రోడు..

హైదరాబాద్: అప్పటి వరకు నిక్షేపంగా ఉన్నాడు.. బైక్ పై వచ్చాడు.. జాకీ షోరూంలోకి వెళ్లాడు.. కావాల్సిన ఐటమ్స్ అడిగాడు.. ఇంతలోనే ఏమైందో ఏంటో.. కళ్ల ముందే.. నిల్చున్న వ్యక్తి.. నిట్టనిలువునా.. షోరూంలోనే కుప్పకూలిపోయాడు.. కళ్ల ముందే అప్పటి వరకు నిల్చున్న వ్యక్తి అలా కుప్పకూలిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. షోరూంలోని సిబ్బంది అంతా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ వ్యక్తి చనిపోయారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

కలాల్ ప్రవీణ్ గౌడ్ (37) అనే వ్యక్తి హైదరాబాద్ కేపీహెచ్‎బీ పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్ చెరువు సమీపంలోని జాకీ షో రూమ్‎లో బట్టలు కొనేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే హార్ట్ ఎటాక్ రావడంతో బట్టల షాపులోనే ప్రవీణ్ గౌడ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన బట్టల షాపు సిబ్బంది వెంటనే ప్రవీణ్‎ను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.