టిప్పర్ ఢీకొని ఇబ్రహీంపట్నంలో యువకుడు మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: బైక్​ను టిప్పర్ ఎదురుగా ఢీ కొనడంతో ఒకరు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్​కు చెందిన శీలం కిరణ్ (23) ప్రైవేటు ఉద్యోగి. వ్యక్తిగత పనిపై తుక్కుగూడకు బైక్​పై వెళ్తుండగా, అతడిని వండర్‌‌‌‌లా ఎక్స్‌‌‌‌రోడ్డు వద్ద టిప్పర్‌‌‌‌ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. 

దీంతో కిరణ్​  స్పాట్​లోనే మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు.