కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి మహిళ సూసైడ్!

  •     దుర్గంచెరువులో తేలిన డెడ్​బాడీ

మాదాపూర్, వెలుగు :  మాదాపూర్ దుర్గం చెరువులో ఓ గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ  దొరికింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో చెరువులో డెడ్​బాడీ తేలడంతో స్థానికులు చూసి మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మహిళ డెడ్ బాడీన చెరువులో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 2న ఆ మహిళ(40) కేబుల్ బ్రిడ్జి నుంచి దూకి సూసైడ్​ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ వివరాల కోసం ఆరా తీస్తున్నారు.