పాము కాటుతో మహిళ మృతి

  • నారాయణపేట జిల్లా మద్దూరులో ఘటన

మద్దూరు, వెలుగు : పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన నారాయణ పేట జిల్లాలో జరిగింది.  స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మద్దూరు మండల కేంద్రానికి చెందిన మ్యాతరి పరమానందం, నర్సమ్మ(48)  దంపతులు రోజుమాదిరిగానే తమ పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం ఎద్దులకు గడ్డి వేద్దామని నర్సమ్మ వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో భర్త వెళ్లి చూడగా పాము కాటు వేసినట్టు భార్య చెప్పింది. అతను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం నారాయణ పేట జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దంపతులకు నలుగురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.