మహిళ దారుణ హత్య.. డెడ్‌‌బాడీపై గడ్డి కప్పి

 వికారాబాద్ జిల్లా: తాండూరులో మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె డెడ్‌ బాడీపై గడ్డి కప్పారు. తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్ సమీప దూరంలో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. మృతురాలి అక్క తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోస్గి నియోజకవర్గం గుండిమల్‌ గ్రామానికి చెందిన పి.తిరుపతమ్మ(37) భర్తలేక పోవడంతో తల్లిగారి ఇంట్లో ఉంటోంది. ఈమెకు ప్రభుత్వం ఆసరా ఒంటరి మహిళ ఫించన్‌ కూడా అందుతోంది.


అయితే తాండూరు పట్టణం సాయిపూర్‌లో ఉంటున్న అక్కవద్దకు గత రెండు నెలల క్రితం వచ్చింది. అక్కడే ఉంటూ ఓ ఇంట్లో పనిమనిషిగా చేరింది. రోజూ పనికి వెళ్లి వచ్చే తిరుపతమ్మ శుక్రవారం రాత్రైనా రాలేదు. అక్క   తెలిసిన వారిని విచారించిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో శనివారం తాండూరు పోలీస్టేషన్ సమీపంలోని రాయల్ కాంటా వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో మహిళ డెడ్‌ బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.