అయ్యో పాపం: కోతులు దాడి చేయడంతో కిందపడి మహిళ మృతి

నిర్మల్: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కింద పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఖానాపూర్‎లోని విద్యానగర్ కాలనీకి చెందిన బొంగోని లక్ష్మీ (50)పై కోతుల గుంపు దాడికి ప్రయత్నించింది. దీంతో తీవ్ర భయాందోళకు గురైన లక్ష్మీ పరుగులు పెట్టింది. కోతుల దాడి నుండి తప్పించుకునే క్రమంలో ఆమె ఇంటి ఆవరణలో కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే లక్ష్మీ మృతి చెందింది.

ALSO READ | నానమ్మని త్రిశూలంతో చంపి శివలింగానికి రక్తాభిషేకం : తర్వాత..?

స్థానికులు గమనించి కోతులను తరమగా.. తీవ్ర గాయాలతో లక్ష్మీ అప్పటికే ప్రాణాలు విడించింది. కోతుల దాడి నుండి తప్పించుకునే క్రమంలో లక్ష్మీ మృతి చెందడంతో విద్యానగర్ కాలనీలో విషాదం అలుముకుంది. ఏమి చేయలేని నిస్సహయ స్థితిలో లక్ష్మీ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికైనా కోతుల బెడదను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.