12 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. ముగ్గురు పిల్లలు ఉన్నారు.. మరొకరితో ప్రేమాయణం.. ఆ తర్వాత..

బాలీవుడ్ మూవీ ‘హమ్ దిల్ దే చుకే సనం’ గుర్తుంది కదా..  సేం అలాంటి స్టోరీ.. లేదు లేదు.. అంతకు మించిన స్టోరీ ఒకటి బయట పడింది. లవ్ మ్యారేజ్ చేసుకొని.. ముగ్గురు పిల్లలు ఉండి కూడా.. మరో ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంది ఓ మహిళ. అది కూడా భర్త సమక్షంలో.. భర్త చెప్పడంతోనే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. 

బీహార్ రాష్ట్రంలోని సహర్స జిల్లాలో ఇటీవల జరిగింది ఈ వింత మ్యారేజ్. వివరాల్లోకి వెళ్తే.. జ్యోతిరాణి అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ల క్రితం అనిల్ తో వివాహం జరిగింది. అది కూడా ఒకరినొకరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ.. ఈ మధ్య బ్రజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి కాస్త ప్రేమ వరకు కాదు కాదు.. వివాహేతర సంబంధ వరకు వెళ్లింది. బ్రజేష్ కు కూడా వివాహం అయ్యింది. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. 

అయితే వీరిద్దరు ఈ మధ్య ప్రేమ పక్షులయ్యారంట. రహస్యంగా కలుసుకోవడం.. ఎవరూ చూడట్లేదని తెగ టీనేజర్స్ లాగే లవ్ బర్డ్స్ అయిపోయారంట. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు.. వీళ్లు కూడా తమను ఎవరూ చూడట్లేదని ఆమె భర్త లేని సమయంలో కలుసుకునేవారంట. అయితే తప్పు చేస్తే ఎప్పుడో ఒకప్పుడు దొరకాల్సిందే కదా. భర్త చేతికి చిక్కడంతో వీళ్ల వివాహేతర ప్రేమాయణం బట్టబయలు అయ్యింది.

భార్య ఇలా చేసినందుకు భర్త అనిల్.. వాళ్లిద్దరికీ పెళ్లి చేసి పడేశాడు. అందరి సమక్షంలో పెళ్లి చేసేశాడు అనిల్. అక్కడ ఉన్న కొందరు వీడియో తీయడంతో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోలో.. బ్రజేష్ జ్యోతి తలపై కుంకుమ పెడుతూ కనిపిస్తుంటాడు. వీళ్లద్దరు చేసిన పనికి పెళ్లైతే చేశారు కానీ.. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి.. బ్రజేష్ కు ఉన్న ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి. లవ్ మ్యారేజ్ చేసుకొని ఇదం పని అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.