ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన జంట.. అందరూ చూస్తుండగానే లిప్ లాక్స్, హగ్స్

ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన జంట.. అందరూ చూస్తుండగానే లిప్ లాక్స్, హగ్స్

ఢిల్లీ మెట్రోలో అనేక అసభ్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మహిళల మధ్య ఘర్షణలు, ఆకతాయిల విచిత్ర వేషధారణలు, ముద్దులతో రెచ్చిపోయిన యువతీ యువకులు ఇలా అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయ్యాయి. తాజాగా ఢిల్లీ మెట్రో కోచ్‌లో యువతీ, యువకుడు ముద్దుపెట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.

Also Read : దమ్ముంటే నాపై పోటీ చేయ్.. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్

ఢిల్లీలోని ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ జంట ముద్దులతో రెచ్చిపోయారు. మెట్రో డోర్‌కు ఆనుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌మ్యాన్ అనే నెటిజన్ ట్విటర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశాడు. దీనికి శీర్షికగా.. ‘ప్రేమ గుడ్డిది.. మనుషులు కాదని మనం మరిచిపోయి ఉండవచ్చు’ అంటూ పోస్ట్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సదరు జంటపై మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఇలా రాశాడు.. జంట యొక్క అపరిపక్వతను ఈ వీడియో చూపుతుంది.. ఇంకా ఎక్కువసేపు దీనిగురించి చర్చించుకోవడం అనవసరం అంటూ అభిప్రాయపడ్డాడు. మెట్రో రైళ్లలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మెట్రో సిబ్బంది సాధారణ దుస్తుల్లో స్టేషన్ లలో, రైల్వే బోగీల్లో పెట్రోలింగ్ చేయాలని సూచించాడు. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో స్పందించింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనల సమయంలో మెట్రో సిబ్బంది లేదా సీఐఎస్ఎఫ్ కి వెంటనే తెలియజేయండి.. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చు అని ప్రయాణికులను కోరింది.

మెట్రోలో ప్రయాణించే కొందరు పలుసార్లు అనుచిత ప్రవర్తనతో తోటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు అనేక నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోతుంది.