లక్డీకాపూల్‎లో దారుణం.. బ్రిడ్జి కింద పసికందు

బషీర్ బాగ్, వెలుగు: అప్పుడే పుట్టిన పాపను మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ లక్డీకాపూల్ రైల్వే బ్రిడ్జి కింద వదిలేసి వెళ్లారు. వాహనదారులు గమనించి వెళ్లి చూడగా అప్పటికే పాప మృతి చెందింది. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉస్మానియా హాస్పిటల్‎కు తరలించారు. కేసు నమోదు చేశారు.