
మెటావర్స్.. అధునాతన టెక్నాలజీకి మరో అదనపు సొబగులా భావిస్తున్న దీనిపై చాలా అంచనాలున్నాయి. ఫిజికల్, డిజిటల్ ప్రపంచాలు కలిసిపోయే వర్చువల్ 3 డీ మెటావర్స్గురించిన ఇంట్రస్ట్రింగ్ అధ్యయనం ఒకటి వచ్చింది. శతాబ్దం చివరి నాటికి మెటావర్స్తో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలను 0.02 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించవచ్చని ఆ అధ్యయనం సారాంశం.
ఎనర్జీ అండ్ఎన్విరాన్మెంటల్సైన్స్ జర్నల్ ప్రచురితమైన ఓ కథనంలో.. మెటావర్స్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు, కార్బన్డయాక్స్తైడ్ సాంద్రతను తగ్గించడం, మొత్తం గృహ ఇంధన వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో పని చేస్తుందని ఉంది. ఎయిర్ క్వాలిటీని మెరుగుపరచడంలో మెటావర్స్ ఆధారిత రిమోట్ వర్కింగ్, దూర విద్య, వర్చువల్ టూరిజం దోహదపడతాయని అధ్యయనం తెలియజేసింది. రవాణా, వాణిజ్య ఇంధన వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేస్తుందట. శాస్ర్తవేత్తలు 2050 వరకు మెటావర్స్ విస్తరణను అంచనా వేశారు. దానికి గణనీయమైన కెపాసిటీ ఉన్నప్పటికీ.. పరిమితులూ ఉన్నాయని చెబుతున్నారు.